సంక్రాంతి పండగను సినిమాల పండగ పిలుస్తారు. ఎందుకంటే… టాలీవుడ్‌లో ఆగ్రహీరోలందరూ సంక్రాంతి పండగ సందర్భంగా బరిలో నిలబడతారు. కానీ తాజాగా తెలుగు సినిమా నిర్మాతల మండలి స్పందించింది. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదంటూ ఓ లేఖను రాసింది. 2023 సంక్రాంతి పండగ సమయంలో తెలుగు సినిమాల రిలీజ్ కు ప్రధమ ప్రాధాన్యత అంటూ తెలుగు సినిమా నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై కోలీవుడ్ దర్శకుడు స్పందించారు.. తమ రాష్ట్రంలో కూడా తెలుగు సినిమాల రిలీజ్ ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీంతో దక్షిణాదిలో ప్రాంతీయ సినిమాల మధ్య వివాదం నెలకొంది.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. డబ్బింగ్ సినిమాల విడుదల అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు. ఏ సినిమాలో దమ్ముంటే..ఆ భాష, ఈ భాష అన్న భేదం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పారు. మంచి సినిమాలను ఎవరైనా ఆదిరిస్తారు.. నార్త్, సౌత్ అనే తేడా ఇప్పుడు లేదన్నారు.
ఇవి కూడా చదవండి..