అల్లు అరవింద్ -బోయపాటి కాంబోలో భారీ ప్రాజెక్ట్‌

15
- Advertisement -

కొన్ని కాంబినేష‌న్స్ గురించి విన‌గానే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం ఖాయం అనిపిస్తుంది. అచ్చంగా అలాంటి కాంబినేష‌నే.. క‌మర్షియ‌ల్ మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ల‌ది. 2016లో ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ ప్రాజెక్ట్ స‌రైనోడు చిత్రం ఎలాంటి అఖండ విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే.

అల్లు అర్జున్‌-బో్య‌పాటి క‌ల‌యిక‌లో రూపొందిన స‌రైనోడు మాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా నిలిచి అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే తాజాగా ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌ల‌యిక‌లో మ‌రో భారీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. భ‌ద్ర తుల‌సి, సింహా, లెజెండ్‌, స‌రైనోడు, అఖండ‌, వంటి క‌మర్షియ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను త‌న అద్బుత‌మైన మాస్‌మేకింగ్ స్కిల్స్ తో సినిమాలు తెర‌కెక్కించి మాస్ చిత్రాల‌కు కేరాప్ అడ్ర‌స్‌గా నిలిచే బోయ‌పాటి శ్రీ‌ను, వైవిధ్య‌మైన వాణిజ్య క‌థాంశాల‌ను అత్యున్న‌త‌మైన నిర్మాణ విలువ‌ల‌తో నిర్మించి ఎన్నో అఖండ విజ‌యాలు సొంతం చేసుకున్న గొప్ప నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత ప్ర‌ముఖ అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూస‌ర్ క‌ల‌యిక అన‌గానే సినీ ప్రేమికుల్లో ఎంతో ఉత్సాహం, ఉత్తేజం క‌లుగుతుంది. సో ఆ ఉత్సహానికి , ఆ ఉత్తేజానికిఅంద‌రూ రెడీ కావాల్సిందే. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం అన్నారు.

Also Read:Rohit Sharma:వ్యక్తిగత రికార్డ్స్ వేస్ట్..!

- Advertisement -