Pawan:ఇంకెన్ని త్యాగాలు.. సేనాని?

27
- Advertisement -

ఈసారి జనసేనదే ప్రభుత్వం అన్నారు.. తీర రెప్పపాటులోనే ఇతర పార్టీలతో చేతులు కలిపారు. పొత్తు ఎందుకు అని ప్రశ్నిస్తే రాష్ట్రాభివృద్ది కోసమన్నారు.. పోనీ పార్టీ కోసం పని చేద్దామంటే అసలు పార్టీకి బలం లేదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. పొత్తులో భాగంగా పార్టీకి 40 సీట్లు వస్తాయని భావిస్తే.. 24 సీట్లు మాత్రమే ప్రకటించి అందరిని విస్మయానికి గురి చేశారు. సరే అధినేత మాటే శాసనం అనుకుంటే.. 24 సీట్లలో కూడా మళ్ళీ మూడు సీట్లు త్యాగం చేసి 21 కే మరిమితం అయ్యారు.. ఇది ప్రస్తుతం జనసేన క్యాడర్ లోనూ జనసైనికుల్లోనూ కనిపిస్తున్న ఆవేధన. అసలు అధినేత పవన్ ఏం ఆలోచిస్తున్నారు ? పార్టీ బలాన్ని ఎందుకు తక్కువగా అంచనా వేస్తున్నారు ? ఎందుకు త్యాగాలు చేస్తున్నారు ? అని అర్థం కాక జనసేన క్యాడర్ తలపట్టుకుంటుంది. .

గతంలో వ్యూహం తనకు వదిలేయండి అని చెప్పిన పవన్.. అసలు ఏ వ్యూహం అమలు చేస్తున్నారో అర్ధం కానీ పరిస్థితి. పార్టీలో స్థిరమైన నిర్ణయాలు, కచ్చితమైన ప్రణాళికలు ఉన్నప్పుడే క్యాడర్ మరియు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు. కానీ జనసేన పార్టీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. తెప్ప లేని పడవ వలె రాజకీయాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు పవన్. ఈ విధమైన వైకరి కారణంగానే పార్టీ ఇంతవరకు సంస్థాగతంగా బలోపేతం కాలేదు. అయినప్పటికి పార్టీని బలోపేతం చేయడం మాని ఇంకా పార్టీ బలాన్ని తగ్గించేలా పవన్ వ్యవహరించడం జనసేన నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట.

ప్రస్తుతం కేటాయించిన 21 సీట్లు కూడా ఎన్నికల సమయానికి ఇంకా తగ్గిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. ఈ నేపథ్యంలో అధినేత అర్థం కానీ వ్యూహాల కారణంగా తీవ్ర నైరాశ్యంలో ఉన్న జనసేన కార్యకర్తలు.. పార్టీ కొరకు ఉత్సాహంగా పని చేయడం కూడా కష్టమే అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అసలు పవన్ ఎందుకు సీట్ల విషయంలో త్యాగం చేస్తున్నారు ? ఆ విషయంపై పార్టీ క్యాడర్ ను బుజ్జగించడంలో ఎందుకు విఫలం అవుతున్నారనేది ఎవరికి అర్థం కానీ అంశంగా మారింది. తన వైఖరి కారణంగా పార్టీలో అంతర్గతంగా ఏర్పడ్డ నైరాశ్యన్ని పవన్ దూరం చేస్తారా ? లేదా తన పంతాలో అలాగే కొనసాగుతారా అనేది చూడాలి.

Also Read:టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ దూరం?

- Advertisement -