ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. జనసేన 30 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు టీడీపీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉన్నట్లు వినికిడి. ఇదిలా ఉండగా జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు మొదటి నుంచి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. సింగిల్ గా పోటీ చేస్తేనే పార్టీకి మేలు జరుగుతుందని పొత్తులో ఉండడం వల్ల పార్టీకి నష్టమే తప్ప వచ్చే లాభం ఏమీ లేదనే భావనతో జనసేనలోని ఓ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే ఎప్పటికప్పుడు పొత్తు పెట్టుకోవడానికి గల కారణాలను పవన్ ఆయా సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి పొత్తుకు దారి తీసిన అంశాల గురించి ఆయన ప్రస్తావించినట్లు వినికిడి. సింగిల్ గా పోటీ చేస్తే 40 సీట్లు గెలిచే అవకాశం ఉందని, అయితే 40 సీట్లతో అధికారంలోకి రావడం అసాధ్యం అందుకే పొత్తు పెట్టుకొని ముందుకు వెలుతునట్లు జనసైనికులకు మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అందువల్ల టీడీపీ జనసేన పొత్తుకు అందరూ సహకరించాలని కూటమి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పవన్ కోరినట్లు టాక్.
తాజాగా భీమవరం వెళ్ళిన పవన్ అక్కడి పార్టీ నేతలకు ఈ రకమైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ జనసేన పొత్తు వల్ల టీడీపీకే ఎక్కువ మేలు జరుగుతుందనేది చాలమంది అభిప్రాయం. పైగా టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన పవన్ సిఎం అయ్యే అవకాశాలు తక్కువే. అందుకే జనసైనికులు పొత్తుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి పవన్ ఏ ఉద్దేశ్యంతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారది జనసైనికులకు అంతుచిక్కని మిస్టరీగా ఉంది. పైగా పొత్తు విషయంలో అసంతృప్తిగా ఉన్న జనసైనికులు పార్టీకి ఎంతవరకు సహకరిస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. మరి టీడీపీతో పొత్తు పవన్ కు ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందో చూడాలి.
Also Read:రెమ్యునరేషన్ బాగా తగ్గించేసుకుంది!