‘నాంది’ ట్రైల‌ర్‌.. అల్లరి నరేష్ నటన అదిరింది..

159
Naandhi Trailer
- Advertisement -

అల్లరి నరేష్ పూర్తి భిన్న‌మైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్ర‌ పోషిస్తున్న చిత్రం ‘నాంది’. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఇదివ‌ర‌కే విడుద‌ల చేసిన స్టిల్స్, పోస్ట‌ర్లు ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తినీ, అంచ‌నాల‌నూ పెంచుతూ వ‌చ్చాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను మ‌హేష్ విడుద‌ల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మూవీని ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు.

ఇక ట్రైల‌ర్‌ విషయానికొస్తే.. చేయ‌ని త‌ప్పుకు జైలు శిక్ష అనుభ‌వించే వ్య‌క్తి పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టించారు. పూర్తి ప‌ర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌గా నాంది చిత్రం ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో న‌రేష్ లోని సరికొత్త కోణం బ‌య‌ట‌కు రానుంది. ఇక‌ లాయర్ గా టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి రోల్‌లో కనిపిస్తోంది. శ్రీచరణ్‌ పాకాల సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందించారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. చోటా కె. ప్రసాద్ ఎడిటర్. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. చైతన్య ప్రసాద్, శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో న‌వ‌మి, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రవీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు ముఖ్య పాత్రలు పోషించారు.

- Advertisement -