అల్లరి నరేశ్ ..ఆల్కహాల్

4
- Advertisement -

అల్లరి నరేశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆల్కహాల్. ఫ్యామిలీ డ్రామా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేశారు.

టీజర్‌లో, సత్యకు డ్రైవర్‌గా పనిచేసే నరేశ్ పాత్రతో ఆరంభమవుతుంది. సత్య అతనిని మద్యం తాగమని బలవంతం చేస్తాడు. దానికి నరేశ్ మద్యం వల్ల కలిగే పరిణామాలు చెబుతూ నిరాకరిస్తాడు. అయినప్పటికీ సత్య ఆ ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత నరేశ్ తన స్నేహితులు సీక్రెట్ శరత్ (హర్షవర్ధన్), సౌండ్ సుందర్ (గిరీశ్ కుల్కర్ణి), సుబాష్ (చైతన్య కృష్ణ), సన్యా (రూహాని శర్మ) మరియు ఇతరుల కోసం మద్యం పార్టీ ఏర్పాటు చేస్తాడు.

ఈ ప్లానింగ్ వెనక కారణం ఏమిటని సత్య అడుగుతాడు. దానికి నరేశ్ ఇచ్చిన షాకింగ్ సమాధానం — తాగిన తర్వాత వారిని చంపేస్తాను..టీజర్ ఇక్కడే ముగుస్తూ, ఈ పార్టీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటన్న ఆసక్తిని రేపింది. ఆ మిస్టరీ రాబోయే ట్రైలర్‌లో బయటపడనుంది. జనవరి 1, 2026న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంగీతాన్ని ఘిబ్రాన్ సమకూర్చారు.

Also Read:రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్

- Advertisement -