రచయితగా మారిన అల్లరి నరేష్..

11
- Advertisement -

టాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అల్లరి నరేష్.తన తొలి సినిమా అల్లరినే ఇంటిపేరుగా మార్చుకోగా ఆతర్వాత కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీనే కాదు ఉగ్రం, నాంది లాంటి సినిమాల్లో డిఫరెంట్ పాత్రలో నటించి ఇంప్రెస్ చేశారు.

ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’మే 3న రిలీజ్ కానుంది. నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తుండగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సుడిగాడు 2 కథ నేనే రాస్తున్నాను అని తెలిపారు. త్వరలోనే అది పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఆ సినిమా వచ్చేలా చూస్తాను అని తెలిపారు. మొత్తంగా అల్లరి నరేష్‌ రచయితగా మారడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. నరేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది సుడిగాడు. 7 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 32 కోట్లు రాబట్టింది.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో చల్మాడ లక్ష్మీనర్సింహరావు

- Advertisement -