ఈ వారం తెలుగులో అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అలాగే తమిళ్ బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ రెండూ థియేటర్స్ లోకి వచ్చాయి. అల్లరి నరేష్ నుండి ‘నాంది’ తర్వాత వచ్చిన సినిమా కావడంతో మారేడుమిల్లి ప్రజానీకం పై కొంత బజ్ క్రియేట్ అయింది. తొలి రోజు కలెక్షన్స్ పెద్దగా లేకపోయినా టాక్ బాగుంటే రెండో రోజు నుండి సినిమా పికప్ అవుతుందనే అంచనా వేశారు మేకర్స్. కానీ అనుకోని విధంగా ‘లవ్ టుడే’ అల్లరి నరేష్ కి చెక్ పెట్టేసింది.
వీకెండ్ లో లవ్ టుడే వసూళ్ళు బాగున్నాయి కానీ అల్లరి నరేష్ సినిమాకు మినిమం కలెక్షన్స్ లేవు. నిన్న ఆదివారం కొన్ని ఏరియాల్లో కొంత రెవెన్యూ కనిపించినా లవ్ టుడే పక్కన పెట్టి చూస్తే పొంతన లేకుండా ఉన్నాయి. ఏదేమైనా సినిమా బాగుంటే ఏ భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి ప్రదీప్ తీసిన లవ్ టుడే నిరిపించింది.
కోలీవుడ్ లో యాబై కోట్లు కొల్లగొట్టి తెలుగులో దిల్ రాజు సంస్థ ద్వారా రిలీజ్ అయిన లవ్ టుడే తో కాకుండా అల్లరోడు సెపరేట్ గా సింగిల్ గా వచ్చి ఉంటే యావరేజ్ టాక్ తో ఓ మోస్తారు కలెక్షన్స్ అందుకొని ఉండేది. మరి ఫైనల్ రన్ లో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఎంత కలెక్ట్ చేస్తుందో ? డిస్ట్రిబ్యూటర్స్ ఎంత లాస్ తెచ్చిపెడుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి…