Alcohol:అల్లరి నరేష్..’ఆల్కహాల్’

3
- Advertisement -

టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. తాజాగా తన 63వ సినిమా అనౌన్స్ చేశారు నరేష్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ఆల్కహాల్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో అల్లరి నరేష్ ఆల్కహాల్ లో మునిగిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది.

Also Read:టీజీబీజేపీ చీఫ్‌గా రామచందర్‌రావు!

నరేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోండగా గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -