ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియాకు సమగ్ర చట్టమేదీ..?

30
- Advertisement -

ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియాలను కలిపి ఓ సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని యోచించిన కేంద్ర ప్రభుత్వం, ఇపుపడు దాని ఊసెత్తడం లేదని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ రంగంలో న్యూస్‌ ఛానెళ్లు, వినోద ఛానెళ్లు రాగానే ప్రింట్‌ మీడియా కోసం ఉన్న ‘ప్రెస్‌ యాక్ట్‌ (అబ్జక్షనేబుల్‌ మ్యాటర్‌) 1951’ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ఱయించిందని తెలిపారు. ఇంతలో డిజిటల్‌ మీడియా చొచ్చుకురావడంతో దీనిని కూడా కలిపి సమగ్ర చట్టాన్ని తీసుకురావాలనుకున్నా, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిని గురించి ప్రస్తావించడం లేదన్నారు.

ఇప్పుడికైనా మూడు రకాల మీడియాలను కలిపి సమగ్ర చట్టాన్ని తీసుకురావాలన్నారు. ఈనెల 8, 9, 10వ తేదీల్లో నగర శివార్లలోని పటాన్‌చురులో తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యుజె – టీజేఎఫ్‌) రాష్ట్ర ద్వితీయ మహాసభలు, ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజేయూ)10వ ప్లీనరీలకు సంబంధించి బుధవారం బేగంపేట్‌లోని హోటల్‌ టూరిజం ప్లాజాలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహాసభల వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ జరిగింది.

ఈ సందర్భంగా మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ డిజిటల్‌ మీడియా ప్రవేశంతో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని జర్నలిస్టులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కార్డులు జారీ చేయడం జరిగిందని, కార్డుల జారీలో సమస్యలేమైనా ఉంటే వాటిని కూడా పరిష్కరించడం జరుగుతుందన్నారు. కోవిడ్‌ సమయంలో జర్నలిస్టులను ఆదుకునేందుకు రూ. 7 కోట్ల నిధులతో 4 వేల మందికి ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. జాతీయ స్థాచి ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌కు రెండు తెలుగు రాష్ర్టాలే అత్యధిక సభ్యత్వాన్ని అందిస్తున్నాయని, అందుకే ఈ సారి హైదరాబాద్‌లో ఐజేయూ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో 2001లో పురుడుపోసుకున్న తెలంగాణ జర్పలిస్ట్‌ ఫోరమ్‌ (టీజేఎఫ్‌) ప్రస్తుతం టీయూడబ్ల్యుజేగా కొనసాగుతోందని, దీని రాష్ట్ర మహాసభలు, ఐజేయూ పీనరీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యుజే సలహాదారు, అంథోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసారగ్‌, ఉపాధ్యక్షులు రమేష్‌ హజారే, నగర శాక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యోగానంద్‌, నవీన్‌కుమార్‌, యార, టీఎంఈజేయూ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఇస్మాయిల్‌, రమణకుమార్‌లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -