సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు- అల్లం నారాయణ

576
allam narayana
- Advertisement -

గురువారం సీఎం కేసీఆర్‌ తెలంగాణభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో.. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత తనదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సరిగా రాలేదన్నారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవారికి కూడా స్థలాలు రాలేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వందకు వంద శాతం హైదరాబాద్‌లో ప్రతీ జర్నలిస్టుకు ఇళ్లు వచ్చే బాధ్యత తనదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

దీనిపై తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పందించారు. జర్నలిస్టుల సమస్యలపై స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని, ఇంటి స్థలాల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అట్లాగే మీడియా అకాడమీ తరుఫున చేసిన పనిని గుర్తించి అభినందించి నిధులు పెంచి అకాడమీ కార్యక్రమాలు జరగడానికి శ్రద్ధ తీసుకుంటానని, జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి మీడియా అకాడమీ అనే స్థలం ఉన్నదని ప్రత్యేకంగా చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి హృదయపూర్వక వందనాలు తెలియజేశారు.

- Advertisement -