- Advertisement -
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజుకు పదుల సంఖ్యలో ప్రాణాలు కొల్పోతుండగా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ జర్నలిస్టులు మృతిచెందారు. జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తితో రోనాతో మృతిచెందిన జర్నలిస్టులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ. 2 లక్షలు అందించనుంది. గత వారం పది రోజుల్లో కరోనా బారినపడి మృతిచెందిన 15 మంది జర్నలిస్టులకు ఆర్థికసాయం కోసం మే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. అలాగే సెకండ్ వేవ్‌లో ఆ మహమ్మారి బారనపడిన 200 మంది జర్నలిస్టులకు నేటి నుంచి ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్టు అల్లం నారాయణ వెల్లడించారు.
- Advertisement -