జగన్‌కు షాక్.. వైసీపీకి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజీనామా

49
- Advertisement -

ఏపీ ఎన్నికల వేళ వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు గట్టి షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అందజేశారు. రామకృష్ణారెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ఆర్ కుటుంబానికి రామకృష్ణారెడ్డి చాలా సన్నిహితమైన వ్యక్తి. వైసీపీ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో లోకేష్ పై పోటీ చేసి గెలిచారు. కొంతకాలంగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు ఆర్కే.

Also Read:ఓటీటీ:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -