ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ..

17
- Advertisement -

మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీకి వివిధ దేశాధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక మోడీ విజయం పట్ల చైనా సైతం విషెస్ తెలిపింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలు మరింత మెరుగుపర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది.

భార‌త్‌తో బ‌ల‌మైన‌, స్థిర‌మైన రిలేష‌న్ ఇరు దేశాల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని, ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి కూడా స‌హ‌క‌రిస్తుంద‌ని చైనా విదేశాంగ మంత్రి మావో నింగ్ తెలిపారు. రెండు దేశాల ప్రాథ‌మిక ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని భార‌త్‌తో ప‌నిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చైనా ప్ర‌తినిధి తెలిపారు.

2020లో ల‌డాక్‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు బ‌ల‌హీన‌ప‌డ్డ విష‌యం తెలిసిందే.

Also Read:పార్లమెంట్ రద్దు..8న పీఎంగా మోడీ ప్రమాణం

- Advertisement -