ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాది గ్యాప్ వచ్చినా ఓపికతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని ప్రతి విషయంలో లక్ష్యంగా మార్చుకోవడానికి ప్రయత్నించే సోషల్ మీడియా బ్యాచులు ఎక్కువైపోయాయి. మొన్నటిదాకా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల విషయంలో నానా రభస చేసి అసలు కారణాలు తెలుసుకోకుండా కేవలం రామ్ చరణ్ నే గుర్తించారనే సాగించిన ప్రచారానికి స్వయంగా ఆ సంస్థే చెక్ పెట్టాల్సి వచ్చింది. తారకరత్న మరణం, దానికన్నా ముందు ప్లాన్ చేసుకున్న కొరటాల శివ సినిమా ఓపెనింగ్ వల్ల యుఎస్ వెళ్ళలేకపోయిన జూనియర్ ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని ఫ్యాన్స్ ఫిర్యాదు
తాజాగా తారకరత్న పెద్దకర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన వితరణ సభలో బాలకృష్ణ కావాలనే తారక్ ని పలకరించకుండా నిర్లక్ష్యం చేశారనే వీడియోని ట్విట్టర్ లో తెగ వైరల్ చేస్తున్నారు. దానికి ముందు ఆ తర్వాత అసలు అక్కడ వివిధ సందర్భాల్లో ఏమేం జరిగిందనే ఫుటేజ్ లేకుండా కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్న ఈ చిన్న బిట్ ని తీసుకుని నానార్ధాలు తీస్తున్నారు. నిజానిజాలేంటో పూర్తిగా ఎవరికి నిర్ధారణ లేదు. దీంతో యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగి సానుభూతి ట్వీట్లు, ట్రోల్స్ గట్రా చేస్తూ అర్థం లేని వాదనలకు చోటు కల్పిస్తున్నారు. అబ్బాయిని బాబాయ్ పట్టించుకోలేదంటూ కథనాలు అల్లేస్తున్నారు.
ఇంకో మూడు రోజులో జూనియర్ అమెరికా వెళ్లబోతున్నాడు. తన సినిమా ఎంత ఆలస్యమవుతున్నా రాజమౌళి పిలవడం ఆలస్యం సంవత్సరం పైగా పిలిచిన చోటికెల్లా వెళ్లి ప్రమోషన్లకు సహకరిస్తున్న తారక్ కు ఇలాంటి డిస్ట్రబెన్సులు పంటి కింద రాళ్ళలాంటివి. ఇప్పుడు తన కర్తవ్యం ఆస్కార్ ఈవెంట్ చేసుకుని తిరిగి రాగానే షూటింగ్ ని వేగవంతం చేయడం. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ ని ఒక కొలిక్కి వచ్చేలా ప్లానింగ్ చేసుకోవడం. అంతే తప్ప కొత్తగా ఎవరికో సమాధానం చెప్పేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయనక్కర్లేదు. ఇంకో ఏడాది దాకా కొత్త రిలీజ్ ఛాన్స్ లేదు కాబట్టి తనకన్నా ఎక్కువగా అభిమానులకు సంయమనం అవసరమయ్యేలా ఉంది.
ఇవి కూడా చదవండి..