వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను షర్మిల ఖండించను లేదు అలాగని సమర్థించను లేదు.. మౌనంగా ఉంటూ వచ్చింది. దీంతో ఆమె ఎటు తేల్చుకోలేక పోతున్నారా అనే సందేహాలు వ్యక్తమౌతు వచ్చాయి. కానీ ఎట్టకేలకు ఆమె కాంగ్రెస్ వైపే అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమౌతోంది. వైఎస్ షర్మిల తాజా కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం బెంగళూరు లో ఉన్న ఆమె పార్టీ విలీనం పై తుది నిర్ణయం కోసమే డికె తో భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. .
ఆ మద్య కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత డికె శివకుమార్ తో షర్మిల బేటీ అయినప్పటి నుంచి ఆమె పార్టీ విలీనంపై చర్చ మొదలైంది. ఆ తరువాత పలు దఫాలుగా షర్మిల డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆమె డీకే ను కలవడంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు తుది అడుగులు పడుతున్నాయనే టాక్ నడుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో డీకే తోపాటు షర్మిల కూడా కాంగ్రెస్ అధిష్టానంతో కలిసే అవకాశాలు ఉన్నాయని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.
Also Read:బ్యాంక్ సేవలన్నీ ఇకపై వాట్సాప్ లోనే..?
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంలో డీకే శివకుమార్ ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ కు షర్మిల అవసరం లేదని.. ఆంధ్రలో కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఒకవేళ షర్మిల కాంగ్రెస్ లో చేరితే ఆంధ్ర కాంగ్రెస్ లో చేరుతుందా లేదా తెలంగాణ కాంగ్రెస్ లో చేరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తాజా పరిణామాలు చూస్తుంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమనే చెప్పాలి.
Also Read:మహేష్ – త్రివిక్రమ్.. ఇద్దరికీ అసంతృప్తే