- Advertisement -
విశాఖలో యోగా డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. యోగా డే ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు..ఇప్పటికే అధికారులకు అన్ని కీలక సూచనలు చేశారు. విశాఖలోనే మంత్రుల బృందం మకాం వేయగా ఆర్కే బీచ్ రోడ్‌లో ప్రధాన వేదిక నిర్మాణం చేపట్టనున్నారు.
ఈరోజు సాయంత్రం విశాఖపట్నానికి లోకేష్ రానుండగా రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు రానున్నారు. అలాగే ఆంధ్రాయూనివర్సిటీలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేయనున్నారు.
25 వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయనుండగా విశాఖ తీరంలో 20, 21 తేదీల్లో చేపల వేటపై ఆంక్షలు విధించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
Also Read:నైపుణ్యం ఉంటేనే సక్సెస్!
- Advertisement -

