లాఠీతో దుమ్ముదులపనున్న విశాల్!

62
vishal
- Advertisement -

ఎ.వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం లాఠీ. ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకోగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని రానా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ, నంద సంయుక్తంగా నిర్మించారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏక‌కాలంలో విడుద‌ల కానుంది. టీజ‌ర్ జూలై 24న విడుద‌ల చేయనుండగా ఇందుకు సంబంధించి టీజ‌ర్ ప్రోమోను మేకర్స్ విడుద‌ల చేశారు.

ఈ వీడియోలో సినిమా క్రూ మెంబ‌ర్స్ టీజ‌ర్ లాంచ్‌కు ప్లాన్ సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడు. యాక్ష‌న్ థ్రిల్లర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ముందుగా ఆగ‌స్టు 11న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ షూటింగ్ స‌మ‌యంలో విశాల్ రెండు సార్లు మేజ‌ర్‌గా గాయ‌ప‌డ‌టంతో చిత్రీక‌ర‌ణ‌ లేట్ అయింది. దాంతో ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 15కు పోస్ట్ పోన్ చేశారు.

- Advertisement -