దేశ రాజకీయాలకు దిక్సూచిగా టీఆర్ఎస్‌ ప్లీనరీ…

214
All set for TRS Plenary says KTR
- Advertisement -

దేశరాజకీయాలకు దిక్సూచిగా టీఆర్ఎస్ ప్లీనరీ నిలవనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 27న కొంపల్లిలో టీఆర్ఎస్‌ ప్లీనరీకి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని …ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు 9 కమిటీలను వేశామని వెల్లడించారు. మంత్రి జగదీష్‌ రెడ్డితో కలిసి ప్లీనరీ సభాస్ధలి ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రతినిధుల సభ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు.

ప్లీనరీకి 13 వేల మంది హాజరుకానున్నారని వెల్లడించారు. మంత్రులు,ఉప ముఖ్యమంత్రుల నుంచి సర్పంచ్‌ల వరకు ఈ ప్లీనరికి హాజరవుతారని తెలిపారు. అంతేగాదు 20 దేశాల నుంచి టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్లీనరికి వస్తారని కేటీఆర్ తెలిపారు.పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని వెల్లడించారు.

ktr

వేసవి ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముస్లిం సోదరుల కోసం నమాజ్‌ చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్లీనరీ నేపథ్యంలో నగరాన్ని గులాబీమయం చేస్తామన్నారు. ప్లీనరీలో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు,అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా చర్చజరగనుందన్నారు. ఎన్నికలకు ముందు జరగబోయే అతి ముఖ్యమైన ప్లీనరీ ఇది అన్నారు. భవిష్యత్ రాజకీయాలకు ఈ ప్లీనరీ ఓ సూచిక అన్నారు. తెలంగాణ దేశానికే రోల్‌ మాడల్‌గా నిలవనుందన్నారు కేటీఆర్.

- Advertisement -