ప్లీనరీకి సర్వం సిద్ధం… కార్యక్రమాలు

223
All set for TRS plenary
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) 16వ వార్షికోత్సవాలకు సిద్ధమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి జరుగుతున్న ప్రతినిధుల సభ(ప్లీనరీ)కి హైదరాబాద్ నగర శివారులోని కొంపల్లి సిద్దమైంది. ఈ సంధర్బంగా టీఆర్‌ఎస్ ప్లీనరీ ప్రారంభం సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు  ప్లీనరీ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపానికి పుష్పాలను సమర్పిస్తారు. అనంతరం ఎంపీ కే కేశవరావు లాంఛనంగా పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. నాయిని, మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేస్తారు. ఆ తర్వాత ప్లీనరీకి కొత్త అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహిస్తారు. అమరుల స్మృతిలో రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగత ఉపన్యాసం చేస్తారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తొలి ప్రసంగం చేస్తారు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్లీనరీని ఉద్దేశించి అధ్యక్షోపన్యాసం చేస్తారు.

దాదాపు 15 వేల మంది ప్రతినిధుల హాజరయ్యే ప్లీనరీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతినిధులకు 26 రకాల రుచికరమైన వంటకాలతో విందు భోజనం వడ్డించనున్నారు. మూడేండ్లకాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి, అమలుపరుస్తున్న కార్యక్రమాలను మననం చేసుకుంటూ, రాబోయే రెండేండ్లకు ప్రణాళిక రచించేందుకు, మంచి చెడులను చర్చించుకునేందుకు ఈ ప్లీనరీని వేదికగా చేసుకోవాలని పార్టీ నిర్ణయించింది.

All set for TRS plenary

దాదాపు 60 ఎకరాల్లో ప్లీనరీకి సంబందించిన ఏర్పాట్లను పూర్తిచేశారు. నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది తలెత్తకుండా ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా ప్లీనరీకి వచ్చేవిధంగా ఏర్పాట్లుచేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 60-70 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. ఏ జిల్లావారు ఎలా రావాలో వివరిస్తూ రూట్‌మ్యాప్‌లను కూడా పం పారు. ఇక ఎంపికచేసిన కార్యకర్తలకు ఫొటో ఐడీ కార్డులను ఇవ్వనున్నారు. ఐడీ కార్డు ఉంటేనే ప్లీనరీకి అనుమతించనున్నారు.

మొత్తం 25వేల మందికి భోజన వసతి కల్పిస్తున్నారు. పార్టీ క్రియాశీల కార్యకర్తలకు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, పోలీసులకు, మీడియాకు పలు రంగుల్లో ఐడీ కార్డులు సిద్ధం చేస్తున్నారు.

()ప్లీనరీలో మొత్తం భోజన ఏర్పాట్లకోసం ఆరు డైనింగ్ ఏరియాలుంటాయి. మొత్తం 15వేల మందికి ఇక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.
()డైనింగ్ ఏరియా 1- వెంకటపతిరాజు అకాడమీ: వాలంటీర్ల కోసం.
()డైనింగ్ ఏరియా 2- జీబీఆర్ క్లబ్: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీఐపీలు. 30 కౌంటర్లుంటాయి.
()డైనింగ్ ఏరియా 3- జీబీఆర్ క్లబ్: మీడియా ప్రతినిధులు…15 కౌంటర్లు పెడుతున్నారు.
()డైనింగ్ ఏరియా 4- పీఎస్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లోని…హాల్-1: గన్‌మెన్లకు, డ్రైవర్లకు.
()డైనింగ్ ఏరియా 5- పీఎస్‌ఆర్ కన్వెన్షన్…సెంటర్ హాల్- 2: పోలీసులకు.
()డైనింగ్ ఏరియా 6- ప్రజాప్రతినిధుల డ్రైవర్లకు.

All set for TRS plenary
ప్లీనరీలో ప్రతినిధులకు రుచికరమైన వంటకాలను వడ్డించనున్నారు. ప్లీనరీకి లక్ష వాటర్ బాటిళ్లను, లక్ష వాటర్ బాటిళ్లను సిద్ధం చేస్తున్నారు. వాటర్ బాటిళ్లను జీబీఆర్ క్లబ్ ఏర్పాటు చేస్తున్నది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేకంగా అంబలిని తయారుచేయిస్తున్నారు. భోజనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 26 రకాల ఆహార పదార్థాల మెనూకు పార్టీ పెద్దల నుంచి ఆమోదం తీసుకున్నారు. గ్రీన్‌సలాడ్స్, ఆనియన్ సలాడ్, ప్లెయిన్ పుల్కా, మటన్ బిర్యానీ, దమ్ చికెన్ ఫ్రై, మటన్ షోర్వా, కొరమీను చేప ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, మటన్ దాల్చ, గుడ్డు పులుసు, వెజ్ బగారా రైస్, తెల్ల అన్నం, మిర్చికా సాలన్, ఆలూ టమాటా కూర, గంగవాయిలి పప్పుకూర, పప్పుచారు, పచ్చి పులుసు, పెరుగు చట్నీ, పెరుగు, పాపడాలు, యాపిల్‌తో చేసిన స్వీట్, ఫ్లమ్ కేక్, ఐస్‌క్రీం, తాజా పండ్లముక్కలు, స్వీట్ పాన్, స్పెషల్ పాన్ మెనూలో ఉన్నాయి. భోజనాల వద్ద పదివేల వాటర్ బాటిల్స్, 7500 చల్లని బాటిల్స్ అందజేస్తారు.

టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, 68 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మంత్రులు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యు లు, మాజీ సభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ సభ్యులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, జిల్లా మార్కెటింగ్ సహకార సంఘాల చైర్మన్లు, మాజీ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, మాజీ చైర్మన్లు, నగర కార్పొరేషన్ల మేయర్లు, నగర కార్పొరేటర్లు, మునిసిపల్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పీ సభ్యులు, వ్యవసా య మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల కార్యవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, ఆత్మా కమిటీ అధ్యక్షులు, జిల్లా పాల సరఫరా సంఘం అధ్యక్షులు, జిల్లా పశుగణాభివృద్ధి అసోసియేషన్ అధ్యక్షులు, 2014 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు డెలిగేట్లుగా పాల్గొంటారు. వీరితోపా టు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుచుకునేందుకు ఎమ్మెల్యేలకు, ఇన్‌చార్జీలకు అవకాశం ఇచ్చారు.

- Advertisement -