డిసెంబర్ 7న(రేపు) తెలంగాణలో జరగనున్న పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఈసీ. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 32,185 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు.
సిర్పూర్,చెన్నూరు,బెల్లంపల్లి,మంచిర్యాల,అసిఫాబాద్,మంథని,భూపాలపల్లి,ములుగు,పినసాక,ఇల్లందు,కొత్తగూడెం,అశ్వారావుపేట,భద్రా చలంలో ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
బుధవారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు, ఊరేగింపులు, సినిమా హాల్లో ప్రకటనలు నిషేధమని ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఛానెళ్లలో ఒపీనియన్ సర్వేలు, ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను బ్యాన్ చేసినట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష,జరిమానా విధిస్తామన్నారు. డిసెంబర్ 11న కౌంటింగ్ జరగనుంది.
ప్రతి పోలింగ్ స్టేషన్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక రాష్ర్టంలో మొత్తం ఓటర్లు 2,80,64,684 ఉంటే వారిలో పురుష ఓటర్లు 1,41,56,182 ఉండగా మహిళా ఓటర్లు 1,39,05,811 గా ఉన్నారు. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకర్గం శేరిలింగంపల్లి(5,75,541) కాగా, తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా భద్రాద్రి(1,37,319) నిలిచింది.