Janasena:’సిద్దం’మైన టీడీపీ జనసేన?

17
- Advertisement -

ఏపీలో ఎలక్షన్ ఫీవర్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ రేస్ లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఒకవైపు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోవైపు సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో జోరు చూపిస్తోంది. అయితే వైసీపీతో పోల్చితే టీడీపీ జనసేన పార్టీలు కొంత స్లో గానే ఉన్నాయి. ఎందుకంటే ఇరు పార్టీలకు సంబంధించి సీట్ల కేటాయింపు ఇంకా హోల్డ్ లోనే ఉండడంతో ప్రచార కార్యక్రమాలు కూడా ఆశించిన ష్టాయిలో జరగడం లేదు. దీంతో ఇరు పార్టీల నేతలు కొంత అసహనంగానే ఉన్నారు. ముఖ్యంగా బీజేపీతో పొత్తు అంశం ఓ కొలిక్కి రాకపోవడంవల్లే సీట్ల ప్రకటన ఆలస్యమౌతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాగే ఆలస్యం చేస్తే టీడీపీ జనసేన పార్టీలకు నష్టం తప్పదనేది చాలమంది చెబుతున్న మాట. .

ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు అంశాన్ని పక్కన పెట్టి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని టీడీపీ జనసేన అధినాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 28న తాడేపల్లి గూడెంలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పవన్ చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తోంది. ఈ సభతో ప్రచార కార్యక్రమాన్ని వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నారట. అంతే కాకుండా ఈ సభలోనే అభ్యర్థుల ప్రకటన చేయడంతో పాటు బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ కూడా ఇవ్వనున్నారట. ఇది మాత్రమే కాకుండా ఇరు పార్టీలకు సంబంధించిన ఫైనల్ ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి. ఈ నెల 28 తర్వాత టీడీపీ జనసేన పార్టీలు కలిసి ప్రచార జోరును పెంచనున్నట్లు తెలుస్తోంది. మరి ఓ వైపు సిద్ధం సభలతో హోరెత్తిస్తున్న వైసీపీకి టీడీపీ జనసేన కూటమి ఎంతవరకు బ్రేకులు వేస్తుందో చూడాలి.

Also Read:‘గర్భాసనం’ యొక్క లాభాలు..!

- Advertisement -