ఆల్ క్లియర్.. టీడీపీ తో బీజేపీ దోస్తీ?

58
- Advertisement -

గత కొన్నాళ్లుగా టీడీపీ బీజేపీ మద్య పొత్తు వ్యవహారం దోబుచులాడుతోంది. బీజేపీతో కలిసిఎందుకు టీడీపీ సిద్దంగానే ఉన్న కాషాయ పార్టీ మాత్రం వెనుకడుగు వేస్తోంది. ఎందుకంటే రెండు పార్టీల మద్య గత ఎన్నికల ముందు జరిగిన పరిణామాలు అలాంటివి మరి. 2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ 2019 నాటికి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అంతే కాకుండా మోడి సర్కార్ పై చంద్రబాబు చేసిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. ఆ పరిణామాల దృష్ట్యా టీడీపీతో కలవడానికి బీజేపీ సంకోచిస్తూనే ఉంది. రెండు పార్టీల మద్య జనసేన అధినేత పవన్ సయోద్య కుదిర్చే ప్రయత్నం చేసిన పెద్దగా ఫలించలేదు. .

స్వయంగా పవనే ” టీడీపీ బీజేపీ మద్య డిఫరెన్సెస్ ఉన్నాయని ” వాటి కరణంగానే పొత్తు ఆలస్యమౌతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇంతవరుకు పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏపీలో వైసీపీని గద్దె దించాలంటే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడక తప్పదనేది పవన్ మరియు చంద్రబాబు ఆలోచన. ఇదిలా సాగుతున్న నేపథ్యంలో టీడీపీతో కలవడంపై బీజేపీ తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read:బీజేపీ సైన్యం రెడీ..అయిన డౌటే?

త్వరలోనే పొత్తు విషయమై అమిత్ షా తో చంద్రబాబు బేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఏమాత్రం బలం లేని బీజేపీకి టీడీపీ అవసరత కూడా చాలనే ఉంది. ఈ నేపథ్యంలో వేరే దారి లేక బీజేపీ అధిష్టానం కూడా టీడీపీతో కలవడానికి సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒకవేళ టీడీపీ బీజేపీ మద్య సయోద్య కుదిరితే.. పవన్, చంద్రబాబు.. బీజేపీ పెద్దలు త్వరలో బేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కూటమి రెడీ అయితే ఉమ్మడి సి‌ఎం అభ్యర్థి ఎవరనే దానిపై కూడా తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మరి మొత్తానికి తాజా పరిస్థితులు చూస్తుంటే బీజేపీ టీడీపీ మద్య ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ అయినట్లే తెలుస్తోంది.

Also Read:కోకాపేట భూముల వేలం..ఎకరా 72 కోట్లు

- Advertisement -