శ్రీశ్రీశ్రీ రాజా వారు..గ్రాండ్ రిలీజ్‌కు రెడీ

21
- Advertisement -

‘శ్రీశ్రీశ్రీ రాజా వారు ‘ భారీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు నిర్మాత చింతపల్లి రామారావు . గుర్తుందా శీతాకాలం, రంగ మార్తాండ చిత్రాల నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అందరికీ సుపరిచితమైన పేరు చింతపల్లి రామారావు. వరుస సినిమాలు నిర్మిస్తూ తెలుగు సినీపరిశ్రమలో దూసుకెళ్తున్నారు రామారావు.సంక్రాతి నేపథ్యంలో అశేష ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మీడియా తో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సోలో హీరోగా దర్శకుడు వేగేశ్న సతీష్ కాంబినేషన్లో “శ్రీశ్రీశ్రీ రాజావారు”నిర్మిస్తున్నాను. అదిరి పోయే మంచి కమర్షియల్ సినిమా మా’శ్రీశ్రీశ్రీ రాజ వారు ‘.ఈ నెలలో తొలి కాపీ సిద్ధం కాబోతుంది. అలాగే ఈ ఇయర్ లో కన్నడ లో ఓ ప్రముఖ స్టార్ తో భారీ సినిమా చేస్తున్నాం . అలాగే మరాఠీ లో మరో సినిమా నిర్మించబోతున్నాను. అలాగే తెలుగులో ఓ స్టార్ హీరో తో ఈ ఇయర్ ఎండింగ్ లో ఓ భారీ సినిమా నిర్మించబోతున్నాను. నేను ఎంత భారీ సినిమాలు చేసిన , మంచి కమర్షియల్ వాల్యూస్ తో పాటు, సమాజానికి మేలు చేసే అంశాలు వుండేలా సినిమాలు నిర్మిస్తాను. ఈ క్రమంలో ఏడాదికి మూడు సినిమాలు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

Also Read:Congress:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా అద్దంకి,వెంకట్!

- Advertisement -