సరస్వతి పుష్కరాలు..సర్వం సిద్ధం

7
- Advertisement -

రేపటి నుంచే సరస్వతి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు.

సరస్వతి పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద వీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాల నుంచి సుమారు 50 లక్షల మంది వస్తారని అంచనా వేశారు అధికారులు.

పూర్వ కాలంలో పుష్కరుడు అనే బ్రా హ్మణుడు శివుని కోసం తపస్సు చేస్తాడట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యేక్షమై ఏదైన వరం కోరుకోమని అడుగు తాడు. అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాల తో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమ య్యేట్లు వరం ఇవ్వమని కొరుకుంటాడు. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవు తారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నా యి.

బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున12 రాశుల్లో సంచరిస్తుంటాడు. తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుం టారు. దేశంలోని 12 నదులకు ఒక్కో పుష్కరాలు ఉండనుండగా ముక్తీశ్వర లింగానికి వున్న నాసిక రంద్రాలగుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నదిరూపంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడిందనేది ప్రసిద్ధి.

Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే!

- Advertisement -