Rohith:రోహిత్ రిటైర్మెంట్ అప్పుడే!

69
- Advertisement -

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై తరచూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈ రకమైన పుకార్లు మరింత పెరిగాయి. అయితే తన రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ ఎప్పుడు కూడా స్పందించలేదు. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ గెలిచిన సందర్భంగా తాజాగా తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హిట్ మ్యాన్. చివరి టెస్ట్ గెలిచిన అనంతరం మీడియా సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘ తాను ఆడలేనని భావించినప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తానని, గత 2-3 ఏళ్ల నుంచి తన ప్రదర్శన బాగుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. హిట్ మ్యాన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పట్లో తన రిటైర్మెంట్ లేదనేది స్పష్టమవుతోంది.

ఇక టీమిండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ మినహా మిగిలిన నాలుగు టెస్టుల్లో కూడా టీమిండియా సత్తా చాటింది. ముఖ్యంగా యువ ప్లేయర్స్ అద్బుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ టెస్టు సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యశస్వి జైస్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ లభించింది. ఈ టెస్టు సిరీస్ విజయంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ లో భారత్ స్థానాన్ని మెరుగుపరచుకుంది.

ఇకపోతే రాబోయే మూడు నెలల పాటు టీమిండియాకు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు లేవు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూన్ లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది. అయితే టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్ లో ఆడుతుండడం కొంత ఊరట కలిగించే అంశం. ఐపీఎల్ తర్వాత జూన్ లో ప్రారంభం అయ్యే టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ను ఐర్లాండ్ తో జూన్ 5నా ప్రారంభించనుంది టీమిండియా. ఇక సెప్టెంబర్ వరకు టెస్టు మ్యాచ్ లకు కూడా ఏ విధమైన షెడ్యూల్ లేదు. దీంతో క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read:ఆలుగ‌డ్డ జ్యూస్‌తో ప్రయోజనాలు?

- Advertisement -