భారీ ఎత్తున ‘పెద్దన్న’ రిలీజ్..

154
peddanna
- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఇక ఓవర్సీస్‌లో 1100 థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ ఒక తమిళ చిత్రానికి ఇదే అతిపెద్ద ఓవర్సీస్ విడుదల అని పేర్కొంది. అమెరికాలోనే 677 థియేటర్లలో ,యూఏఈలో ఈ చిత్రం 117 స్క్రీన్లలో విడుదల కానుంది. మలేషియాలో 110 థియేటర్లలో, సింగపూర్‌లో 23 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. శ్రీలంకలో 86 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.

శివ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కెనడాలో 17 థియేటర్లలో, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 35 థియేటర్లలో విడుదల కానుంది. యూరప్‌లో 43 థియేటర్లలో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో 85 థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -