బాలయ్య 109.. టైటిల్ టీజర్?

8
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత బాబీ దర్శఖత్వంలో బాలయ్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్‌లో ఇది 109వ సినిమా కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ నటించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ఓ సాలిడ్ గ్లింప్స్ ని రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టైటిల్ టీజర్‌ని రివీల్ చేయనున్నారట. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

Also Read:Harish:NHM ఉద్యోగుల జీతాలు చెల్లించండి

- Advertisement -