బాలయ్య..వారసుడు వచ్చేస్తున్నాడట

13
- Advertisement -

బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ తేజ హీరో గా ఎపుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా ? అని బాలయ్య ఫాన్స్ ఎదురు చూడని రోజు లేదు. ఇండస్ట్రీలో మోక్షజ్ఞ తేజ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసే రోజు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఆ మధ్యన బాలయ్య చిన్న అల్లుడు భరత్, మోక్షజ్ఞ తేజ కి నటుడిగా అవ్వాలనుంటే అవుతాడు.. దానికి మా కుటుంబం అడ్డు చెప్పదు. కానీ, మోక్షజ్ఞ తేజ కి బిజినెస్ అంటే ఇష్టమని చెప్పారు. బాలయ్య ఫాన్స్ మాత్రం మోక్షజ్ఞ తేజ ఎప్పుడు ఎక్కడ కనిపించినా వారసుడి ఎంట్రీ పై ఎగ్జైట్ అవుతూనే ఉంటారు.

ఇప్పటివరకు కుర్రాడిగా కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ తేజ మొదటిసారి సూపర్ కూల్ పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ లుక్ లో కనిపించేసరికి బాలయ్య ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీ ఓ ఈవెంట్ సెలెబ్రేషన్స్ లో భాగంగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ కూడా బెంగుళూరుకి వెళ్ళాడు. ఫ్యామిలీ సెలెబ్రేషన్స్ లో నందమూరి ఫ్యామిలిలో ప్రత్యేకంగా నిలిచాడు. మోక్షజ్ఞ తేజ పిక్ బయటికి రాగానే బాలయ్య వారసుడొచ్చాడంటూ బాలయ్య ఫాన్స్ పొంగల్ సెలబ్రేషన్స్ ని రెచ్చిపోయి చేసుకుంటున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ తేజ హీరోగా సినిమా కూడా స్టార్ట్ కాబోతుంది.

Also Read:ఇమ్యూనిటీ పెంచుకోండిలా!

- Advertisement -