కల్కి…ప్రీ రిలీజ్ భారీ రేంజ్‌లో!

5
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా జూన్ 10న ట్రైలర్‌ విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు చెన్నై, బెంగ‌ళూరులో ఎంపిక చేసిన థియేట‌ర్ల‌లో సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు క‌ల్కి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనున్నట్లు సమాచారం.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్‌ హాసన్, దీపికా పదుకోణె, దిశా పటాని కీలకపాత్ర పోషిస్తున్నారు.

Also Read:ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’!

- Advertisement -