జగన్ ప్రచారానికి ‘సిద్ధం’ ?

20
- Advertisement -

రెండోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే. మే 13 న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ప్రచారంలో వేగం పెంచే పనిలో ఉన్నారు వైసీపీ అధినేత. ఇప్పటికే సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక త్వరలో బస్సు యాత్ర కూడా చేపట్టేందుకు జగన్ సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి ఇరవై రోజుల పాటు ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టనునట్లు తెలుస్తోంది.

ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు 25 పార్లమెంట్ స్థానాల్లో యాత్రను కొనసాగిస్తూ బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ వర్గాలు రెడీ అయ్యాయి. ఇక ఈ బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దూకుడు కనబరుస్తారు ? ఏ ఏ హామీలు ఇస్తారనే దానిపై అందరి దృష్టి నెలకొంది. గత ఎన్నికల ముందు జగన్ చేసిన ప్రచారం పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చింది. ప్రచారంలో భాగంగా హామీలు ఇస్తూ ప్రత్యర్థి పార్టీపై పదునైన విమర్శలు చేస్తూ ప్రజల దృష్టిని వైసీపీ వైపు తిప్పారు జగన్మోహన్ రెడ్డి. అదే వ్యూహాన్ని ఈసారి ప్రచారంలో కూడా జగన్ పాటించనున్నట్లు తెలుస్తోంది.

మేనిఫెస్టో వాయిదా
ఇక గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ సారి కూడా అదే తరహాలో మేనిఫెస్టో రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించాల్సిన మేనిఫెస్టో ఇతరత్రా కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈనెల 20 న విడుదల చేస్తామని వైసీపీ శ్రేణులు మొదట ప్రకటించినప్పటికి మళ్ళీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ‘ జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం ‘ పేరుతో మేనిఫెస్టో రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈసారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, ఉద్యోగ రూపకల్పన కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.

Also Read:బీజేపీపై ప్రకాశ్‌ రాజ్‌ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -