PSPK:జూలై 3…అందరికీ సర్‌ప్రైజ్!

6
- Advertisement -

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ జూలై 3, 2025న విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో నిర్మాత నాగ వంశీ ఒక్క పోస్ట్‌తో హంగామా చేశారు. అందరికీ ఒక్కటే కోరిక — సమయం త్వరగా ముందుకు వెళ్లి ఆ రోజు రావాలి(హరిహర వీరమల్లు రిలీజ్ డేట్). ఎవరు ఏం ఊహించుకుంటున్నారు నాకు తెలియదు… కానీ జూలై 3న మీ అందరికీ ఓ పెద్ద సర్ప్రైజ్ ఉంది! రెడీ అవ్వండి. మీరు ఊహించనంత స్కేల్, మ్యాడ్‌నెస్, ఎనర్జీతో హరి హర వీర మల్లు ట్రైలర్ రాబోతుంది అని తెలిపారు.

దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాబీ డీయోల్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. నాజర్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పించగా, ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. ఈ చారిత్రాత్మక గాథా అనేక భాషలలో విడుదల కాబోతోంది.

Also Read:తోట శ్రీకాంత్.. థాంక్యూ డియర్

- Advertisement -