కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి:రజత్ కుమార్

364
rajath kumar
- Advertisement -

మే 23న జరిగే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన సచివాలయంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు.

మొత్తం మూడువేల టేబుళ్లు.. ఒక్కో టేబుల్ కు 4గురు సిబ్బంది ఉంటారని చెప్పారు. 20వేల మంది సిబ్బందిని కౌంటింగ్‌కు ఉపయోగిస్తున్నామని చెప్పారు. నిజామాబాద్ లో టేబుల్ కు 6 గురు సిబ్బంది,
17 పార్లమెంట్ నియోజకవర్గాలకు 35 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే సిబ్బంది శిక్షణ పూర్తి చేశామని వెల్లడించారు.

ఎన్నికల తరహాలో కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తామని హైదరాబాద్ లో మాత్రం అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక కౌంటింగ్ సెంటర్ ఏర్పాటుచేశామన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి లో అదనపు టేబుల్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి ఐదు వీవీప్యాట్ల్ లెక్కిస్తామని చెప్పిన రజత్ కుమార్‌ పూర్తి ఫలితాలు సాయంత్రం లోపు రావొచ్చన్నారు.

వీవీప్యాట్ల లలో తేడా ఉంటే వీవీప్యాట్ల స్లిప్ లే ఫైనల్ గా ఉంటాయన్నారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద వేసవి సందర్భంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు.. మంచినీరు.. వైద్యసేవలు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లుచేశామన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద శాంతి భద్రతల కు విఘాతం కలిపిస్తే క్రిమినల్ కేస్ లు బుక్ చేస్తామని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఫలితాలు వెలుబడే వరకు 144 సెక్షన్ ఉంటుందని..కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు.

- Advertisement -