సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రథం సిద్ధమైంది. ఇవాళ్టి నుండి 17 రోజుల పాటు 41 బహిరంగసభల్లో పాల్గొననున్నారు సీఎం. ఇక ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేయనుండగా అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచార రథాన్ని హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. ఈ రథానికి తెలంగాణ ప్రగతి రథం అనే పేరును పెట్టగా ఓ వైపు సీఎం కేసీఆర్,భారతదేశ చిత్ర పటాన్ని ఉంచి ప్రతి ఇంటికి సంక్షేమం,ప్రతి ముఖంలో సంతోషం అనే నినాదాన్ని రాసుకొచ్చారు. అలాగే మరో వైపు సీఎం కేసీఆర్ చిరునవ్వుతో ఉన్న ఫోటోతో పాటు బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును హైలైట్ చేశారు. ఈ ప్రగతి రథంలో 20 మందికి పైగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. తర్వాత 16వ తేదీ నుంచి వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు.1 6న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, మేడ్చల్ బహిరంగ సభల్లో పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుండి పోటీ చేస్తుండగా నవంబర్ 9న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గజ్వేల్‌లో తొలుత తర్వాత కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు.
Also Read:రేవంత్‌కు మరో షాక్..కీలక అనుచరుడు రాజీనామా!