చిత్రలహరి ప్రీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌..

369
chitralahari pre release
- Advertisement -

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కథనాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఏప్రిల్ 6న (ఉగాది) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన మూడు సింగిల్స్ నెటిజన్లను ఆకట్టుకోగా టీజర్‌ కూడా కొత్తగా ఉండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

ప్రీరిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిధిగా హాజరుకానున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ తో ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది. వారి ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ చిత్రలహరి ఆడియో వేడుకకు రానున్నాడని తెలుస్తుంది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. విడుదలకు ముందే పాజిటివ్ టాక్, ఎన్టీఆర్‌ రాకతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ కాగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను రాబడుతుందో వేచిచూడాలి.

- Advertisement -