వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమయింది. ప్రఖ్యాత బీజింగ్ జాతీయ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. వారం రోజులపాటు జరగనున్న ఈ క్రీడల్లో 90 దేశాల నుంచి సుమారు మూడు వేల మంది అథ్లెట్లు పోటీపడబోతున్నారు. ఏడు క్రీడాంశాల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు సాగనున్నాయి.
ఈ వేడుకల్లో భారత్ నుంచి ఒకే ఒక్క అథ్లెట్ పాల్గొంటున్నాడు. జమ్ము కశ్మీర్‌కు చెందిన ఆరిఫ్ ఖాన్ స్కీయింగ్‌లో పోటీపడుతున్నాడు. స్లాలోమ్, జెయింట్ స్లాలోమ్ విభాగాల్లో ఆరిఫ్ బరిలోకి దిగనున్నాడు. వింటర్ ఒలింపిక్స్‌లో భారత్ 1964 నుంచి పాల్గొంటున్నది. అయితే 2002 తర్వాత దేశం నుంచి ఒక్కరే పాల్గొనడం ఇదే మొదటిసారి. కరోనా నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం విదేశీ వీక్షకులకు అనుమతి నిరాకరించింది. ఇప్పటికే కర్లింగ్, లూజ్, స్కై జంపింగ్, అల్పైన్ స్కీయింగ్, ఫ్రీస్టయిల్ స్కీయింగ్, ఐస్ హాకీ, స్కై జంపింగ్ విభాగాల్లో పోటీలు మొదలుకాగా.. శనివారం పతకాల ఈవెంట్లు ఆరంభం కాబోతున్నాయి.