చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు

15
- Advertisement -

ఏపీ సీఎంగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జూన్ 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుండగా ఈ కార్యక్రమానికి చకచకా జరుగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం సమీపంలో కేసరపల్లి వద్ద గల ఐటీ పార్క్, మేధా టవర్స్ నేషనల్ హైవే పక్కన ఉన్న పొట్లూరి బసవరావు స్థలంలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చంద్రబాబు, మంత్రులతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.అతిథులుగా వచ్చిన వారికి, సభాస్థలికి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

ఇక చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనే ఉత్కంఠ తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.

Also Read:బండి సంజయ్‌..కార్యకర్త నుండి కేంద్రమంత్రిగా

- Advertisement -