బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు అమెరికాలోని డల్లాస్ ముస్తాబవుతోంది. పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 1న డల్లాస్‌లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరగనున్న ఈ సంబరాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. దీనిలో一 భాగంగా డల్లాస్‌లో అన్ని సంస్థల ప్రముఖలతో సన్నాహక సభ జరిగింది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, “కేటీఆర్ రాక గురించి అందరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం” అన్నారు.
NRI కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ..చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చిన్న రజతోత్సవ సభలా కాకుండా, డల్లాస్‌లోని అన్ని ప్రముఖులు పాల్గొనడం గొప్ప విషయం. జూన్ 1న మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున హాజరయ్యాలని కోరుతున్నాం. అన్ని పనులు ఊపందుకున్నాయి. అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అన్నారు.
ఈ సభను సజావుగా నిర్వహించేందుకు కొద్ది సమయంలోనే సమన్వయం చేసిన సురకంటి శ్రీనివాస్‌ను మహేష్ బిగాల అభినందించారు. BRS USA అడ్వైజరీ చైర్ మహేష్ తన్నీరు మాట్లాడుతూ..తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కళాకారులు వస్తున్నారు. అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సభను భారీగా నిర్వహించనున్నాం” అని చెప్పారు.
ఈ సభకు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, కోలేటి దామోదర్ లు విమానాశ్రయం నుంచి వచ్చి హాజరయ్యారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ .. మీ అందరితో పాటు కేటీఆర్ గారు సభకు రావాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్లపాటు మనుగడ సాగించిన పార్టీలలో బీఆర్‌ఎస్ ఒకటిగా నిలిచింది. ఏప్రిల్ 27న వరంగల్‌లో రజతోత్సవ సభను అట్టహాసంగా నిర్వహించుకున్నాం. అదే స్ఫూర్తితో డల్లాస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది అని పేర్కొన్నారు.
Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

