బతుకమ్మ పండుగ..భారీ ఏర్పాట్లు

64
- Advertisement -

నేటి నుండి తెలంగాణ పూల పండుగ బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు 9 రోజుల పాటు జరగనుండగా ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేసింది.

బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు రూ. పది కోట్లను కేటాయించింది. ఉత్సవాల చివరి రోజు అక్టోబర్ 3న రాజధానిలోని ఎల్బీ స్టేడియం నుంచి వేల మంది మహిళలు, వెయ్యి మందికిపైగా జానపద గిరిజన కళాకారులతో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. రవీంధ్రభారతిలో ప్రతీరోజూ బతుకమ్మ ఉత్సవాలతో పాటు సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల్లో భారీగా ఏర్పాట్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. బతుకమ్మ మైదానాల వద్ద విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించింది. బతుకమ్మ నిమజ్జనం చేసే ఘాట్ల వద్ద ప్రమాదాల నివారణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వం.

- Advertisement -