Vishal:యాక్షన్ హీరో పెళ్లికి రంగం సిద్ధం

46
- Advertisement -

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నాడని తాజాగా మళ్లీ రూమర్లు వైరల్ అవుతున్నాయి. 46 ఏళ్ళు వయసు వచ్చినా, పెళ్లి పేరు ఎత్తకుండా ఇప్పటివరకు సింగిల్ గానే గడిపేశాడు విశాల్. గతంలో కొందరితో ప్రేమాయణం నడిపి పెళ్ళికి సిద్దమవుతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి గానీ, అవేమీ నిజం కాలేదు. మధ్యలో అనీషా రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఏమైందో ఏమో.. ఆ పెళ్లి కూడా రద్దు అయ్యింది. రీసెంట్ గా ఓ నటితో విశాల్ పెళ్లి జరగబోతుంది అంటూ ప్రచారం చేశారు. కానీ అది కూడా నిజం కాదు అని తేలిపోయింది.

మొత్తానికి విశాల్ కి ప్రేమ ఓకే గానీ, పెళ్లి చేసుకునేందుకు మారం విశాల్ అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే, విశాల్ ప్రేమలు బ్రేకప్ అయ్యాయి అంటున్నారు. అయితే గత రెండు నెలలుగా విశాల్ పెళ్లి విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. విశాల్ తండ్రి జి. కె. రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సమయం వచ్చినప్పుడు హీరో విశాల్ పెళ్లి జరుగుతుంది అంటూ చెప్పారు. ఇక ఈ మధ్యన జి. కె. రెడ్డికి హెల్త్ ఇష్యుస్ రావడంతో ఆయనకి విదేశలలో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే విశాల్ పెళ్లి మరోసారి వార్తల్లోకి వచ్చింది.

విశాల్ పెళ్లి పీటలెకక్కేందుకు రెడీ అవుతున్నట్లుగా మీడియాలో వినిపిస్తుంది. విశాల్ తండ్రి జి. కె. రెడ్డి చెప్పినట్టుగా విశాల్ కి పెళ్లి ఘడియలొచ్చేశాయని.. చెన్నై కి చెందిన ఓ బిజినెస్ మెన్ కుమార్తె తో విశాల్ పెళ్లి నిశ్చయమైంది అని, త్వరలోనే విశాల్ ఏడడుగులు నడిచేందుకు రెడీ అయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం విశాల్ మళ్ళీ ఫుల్ స్వింగ్ లో షూటింగ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

Also Read:IND vs SA T20:బోణి కొట్టేదెవరు?

- Advertisement -