అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్న వనపర్తి..

39
niranjan redddy
- Advertisement -

వనపర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ రకాల పెన్షన్ లకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకుపంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వివిధ రకాల పెన్షన్లు అందిస్తూ వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ. 48.51 లక్షల విలువ గల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 16 వేల 92 ఇండ్లు ఉన్నాయని, ప్రస్తుతం అదనంగా (1,610)మందికి నూతనంగా మంజూరు అయినా ఆసరా పెన్షన్లు మొత్తం 9 వేల 16 మందికి మంజూరు చేశామన్నారు నిరంజన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ పెన్షన్లు అందజేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారన్నారు.

- Advertisement -