బీజేపీలోకి రాజగోపాల్..ముహుర్తం ఫిక్స్!

82
komatireddy
- Advertisement -

బీజేపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేరికకు ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 7న హస్తానికి హ్యాండిచ్చి..కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డితో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కూడా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. పార్టీని వీడేందుకే మొగ్గు చూపారు.

రాష్ట్ర ప్రజలు కూడా మునుగోడు ఉపఎన్నికే కోరుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి మునుగోడు కంచుకోట అని.. దాన్ని కాపాడుకుంటామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం.. పార్టీ అంతర్గత విషయమన్న ఆయన.. ఉత్తమ్‌ సహా పార్టీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.

- Advertisement -