కోవింద్‌కు అభినంద‌న‌ల వెల్లువ

218
All praise for Kovind
All praise for Kovind
- Advertisement -

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు ప్ర‌ముఖుల నుంచి అభినంద‌ల వ‌ర్షం కురుస్తోంది. రామ్ నాథ్ కోవింద్ నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లారు. రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ కు కండువా కప్పి ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతి కోవింద్‌తో కాసేపు ముచ్చటించారు. కోవింద్‌ త‌న బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తార‌ని మోడీ పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం కోవింద్‌తో తాను దిగిన ఓ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు మోడీ. అలాగే కోవింద్‌తో తాజాగా దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేసి గ‌ర్వంగా ఉంద‌ని హ‌ర్షం వ్య‌క్తం చేశారు. రామ్‌నాథ్ నాయకత్వంలో దేశం మరింత ముందుకెళ్తుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యం స్ఫూర్తిని కొనసాగించడంలో రామ్ కోవింద్ విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు.  రామ్ నాధ్ కోవింద్ రాష్ట్రపతిగా ఎన్నకైనందుకు సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.. పలు కేంద్ర మంత్రులు, ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మంత్రులు త‌మ సోష‌ల్ మీడియా ఖాతాలో రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్ నాథ్ కోవింద్ కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ఆయనకు స్వాగతం పలికిన ఫొటోను, ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు కేటీఆర్.

రామ్‌నాథ్ కోవింద్ అనంత‌రం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. గ‌తంలో రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి ఆ ప‌ద‌వికి ఎంతో మంది వ‌న్నెతెచ్చార‌ని ఆయ‌న పేర్కొన్నారు. తాను కూడా వారిలాగే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తాన‌ని పేర్కొన్నారు. త‌న‌కు బాస‌ట‌గా ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్యవాదాలు తెలుపుతున్న‌ట్లు వ్యాఖ్యానించారు. రామ్‌నాథ్ కోవింద్‌కు ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీశుభాకాంక్ష‌లు తెలుపుతూ రామ్‌నాథ్ ఆ ప‌ద‌వికి త‌గిన వ్య‌క్త‌ని పేర్కొన్నారు.

- Advertisement -