నేను ఎగ్గొట్టేవాణ్ణి కాదు..

232
Nagarjuna
- Advertisement -

అన్నపూర్ణ స్టూడియో అభివృద్ధి కోసం గతంలో అక్కినేని నాగార్జున బ్యాంకుల నుంచి రుణం తీసుకుని..బకాయిపడ్డట్టు వస్తున్న వార్తలపై నాగ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే నాగార్జున ఆయన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. దీంతో అప్పటి నుండి కొంతమంది సోషల్ మీడియా ద్వారా నాగార్జున పై కామెంట్ చేశారు. నాగ్‌ బ్యాంకులను బకాయి ఉన్నాడని..వాడిని ఎగ్గొట్టి ఇప్పుడు మోడీకి అభినందలు తెలిపాడని..గతంలో ఒక బ్యాంకు ఆరోపించిన ఒక ఆరోపణను ఆధారంగా చేసుకుని కించపరిచే విధంగా రకరకాల స్టేట్మెంట్లు, కామెంట్లు చేశారు. వాటన్నింటినీ గమనించిన నాగ్ వాటికి గట్టి సమాధానమిచ్చారు.

Nagarjuna

బ్యాంకు రుణాలపై వచ్చిన ఆరోపణలను హీరో నాగార్జున ట్విట్టర్ ద్వారా ఖండించారు. ‘నేను లేదా అన్నపూర్ణా స్టూడియోస్ బ్యాంకులకు ఎలాంటి బకాయిలు లేమని స్పష్టం చేశారు. అన్నపూర్ణ స్టూడియో అభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నమాట వాస్తవమేనని…అయితే ఆ రుణాలు అన్నీ ఈ ఏడాది మొదట్లోనే చెల్లించినట్లు నాగార్జున తెలియజేశారు. ప్రస్తుతం ఎవరికి బకాయి లేనని వివరణ ఇచ్చారు. దీంతో నాగార్జున పై వస్తున్న పుకార్లన్నింటికీ అడ్డుకట్ట పడినట్లైంది. ప్రస్తుతం  నాగ్  రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నమో వెంకటేశాయ  సినిమా చేస్తున్నాడు.

Nagarjuna

Nagarjuna

- Advertisement -