బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గాయలపాలయ్యారని.. బెంగళూరులో జరుగుతున్న కేడీ మూవీ షూటింగ్లో భాగంగా బాంబ్ బ్లాస్ట్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఆయనకు తీవ్ర గాయలయ్యాయని.. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి.. సంజయ్ దత్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని.. ప్రస్తుతం సంజయ్ దత్‌కు వైద్యులు చికిత్స చేస్తున్నారని.. ఇలా చాలా పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ పుకార్లలో వాస్తవం ఎంత అని ఆరా తీయకుండా.. పలు వెబ్ సైట్లు పోటీ పడి మరీ.. సంజయ్ దత్ కి సీరియస్ అంటూ కథనాలు వండి వార్చాయి.
కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ఈ వార్తలో అసలు వాస్తవం లేదు అని తేలింది. షూటింగ్లో ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగలేదు అని.. సంజయ్ దత్ కు ఎలాంటి తీవ్ర గాయాలు తగలలేదు అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అలాగే సంజయ్ దత్ కూడా ఈ పుకార్ల పై స్పందిస్తూ సీరియస్ అయ్యారు. ఈ వార్తలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని సంజయ్ దత్ తెలిపాడు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, షూటింగ్ లో పాల్గొంటున్నానని, సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నప్పుడు మేకర్స్ ఎంతో అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.
కాబట్టి, తమ షూటింగ్ లో ఎలాంటి ప్రమాదం జరగలేదు అని సంజయ్ వెల్లడించాడు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రేక్షకులు నమ్మొద్దని సంజయ్ దత్ సూచించాడు. అయిన, ఈ మధ్య గాసిప్ రాయుళ్లు ఫలానా హీరో షూటింగ్ లో గాయపడ్డాడని అనేక వార్తలను వైరల్ చేస్తూనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి..