విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేసింది. ఈ మ్యూజిక్ కన్సర్ట్ లో ‘ఖుషి’ సినిమాలోని బ్యూటిపుల్ సాంగ్స్ ను సింగర్స్ జావెద్ అలీ, సిధ్ శ్రీరామ్, మంజూష, చిన్మయి, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడి ఆకట్టుకున్నారు. ‘ఖుషి’ టైటిల్ సాంగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లైవ్ పర్ ఫార్మెన్స్ కు ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఖుషి’ పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. మ్యూజిక్ కన్సర్ట్ లో
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ – ‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్ లో ఒక ఆడియెన్ గా ఎంజాయ్ చేయాలని ఫ్యామిలీతో కలిసి వచ్చాను. నన్ను మాట్లాడమని పిలుస్తారని అనుకోలేదు. ప్రేమంటే ఏంటో మా బేబీ సినిమాలోని డైలాగ్ ద్వారా చెబుతాను. ఎవరు లేకపోతే నీ జీవితం నీది కాదో అదే నిజమైన ప్రేమ. మా అన్నయ్య విజయ్, సమంత గారి కోసం బేబీ సినిమాలోని ఓ పాట పాడాలని ఉంది. నా ముందు విజయ్, సమంత రూపంలో ఇద్దరు బ్యుటిఫుల్ యాక్టర్స్ ను చూస్తున్నా. సెప్టెంబర్ 1న థియేటర్స్ లో మస్త్ ఖుషి చేసుకుందాం. అన్నారు.
సినిమాటోగ్రాఫర్ జి.మురళి మాట్లాడుతూ – తెలుగులో అందాల రాక్షసి సినిమా తర్వాత నేను చేస్తున్న మరో ప్రేమ కథా చిత్రమిది. నన్ను కెరీర్ లో ప్రోత్సహించిన నా కుటుంబానికి థాంక్స్ చెబుతున్నా. వారి వల్లే నేను ఈ వేదిక మీద ఉన్నా. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు కృతజ్ఞతలు చెబుతున్నా. రవి, నవీన్ లాంటి మంచి ప్రొడ్యూసర్స్ ను తొలిసారి చూస్తున్నా. రా రస్టిక్ మూవీస్ చేస్తున్న నాకు దర్శకుడు శివ గారు లవ్ స్టోరికి పనిచేసే అవకాశం ఇచ్చారు. ‘ఖుషి’ లో ఆరాధ్య, విప్లవ్ క్యారెక్టర్స్ లవబుల్ గా ఉంటాయి. సినిమా చూశాక వీళ్లిద్దరిని మీరు మర్చిపోలేరు. సెప్టెంబర్ 1న ఈ సినిమాను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అని అన్నారు.
మైత్రీ సీఈవో చెర్రీ మాట్లాడుతూ – ‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్ ను ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయడం సంతోషంగా ఉంది. సంగీత దర్శకుడు హేషమ్ గారు ప్రతి సింగర్, మ్యూజీషియన్ ను తీసుకొచ్చి ఇంత బాగా ప్రోగ్రాం చేస్తున్నారు. ఆయనకు థాంక్స్ చెబుతున్నా. మా సంస్థలో విజయ్ డియర్ కామ్రేడ్ చేశాడు. సమంత రంగస్థలం చేసింది. పుష్ప లో ఆమె స్పెషల్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందో మీకు తెలుసు. వీళ్లిద్దరు మరోసారి మా సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉంది. అలాగే మాకు ఒక మెమొరబుల్ మూవీ చేసిన డైరెక్టర్ శివ గారికి థాంక్స్. ‘ఖుషి’ కోసం ఏదైనా బిగ్ ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు మ్యూజిక్ కన్సర్ట్ బాగుంటుందని అనిపించింది. ఈవెంట్ ను ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
Also Read:వామ్మో..ఇప్పపువ్వుతో లాభాలెన్నో!
సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ – ‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించేందుకు సపోర్ట్ చేసిన ప్రతి సింగర్ కు థాంక్స్. అలాగే ఈ సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చేందుకు మైత్రీ సంస్థ నుంచి లభించిన సహకారం మర్చిపోలేను. ఈ సినిమా మ్యూజిక్ కోసం 15 రోజుల పాటు నేను, డైరెక్టర్ శివ గారు ఒక హోటల్ రూమ్ లో బయటకు రాకుండా లాక్ చేసుకుని ఉండిపోయాం. ‘ఖుషి’ లో లవ్ ఫీల్ ఉన్న పాటలు, మ్యూజిక్ చేసేందుకు నాకు ఇన్సిపిరేషన్ ఇచ్చింది నా డియర్ వైఫ్ ఐషా. ఈ కన్సర్ట్ కోసం నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు. సెప్టెంబర్ 1న థియేటర్స్ లో లవ్ తో పాటు మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకుందాం. అన్నారు.
సారేగమా మ్యూజిక్ లేబుల్ నుంచి విక్రమ్ మెహ్రా మాట్లాడుతూ – ‘ఖుషి’ పాటలను యూట్యూబ్, మ్యూజిక్ యాప్స్ లో 20 కోట్ల మందికి పైగా విన్నారు. చూశారు. మా సంస్థకు ఇంత పెద్ద హిట్ ఆడియో ఇచ్చిన మైత్రీ సంస్థకు థాంక్స్. ఈ సినిమా పాటలు వింటే లవ్ మ్యాజిక్ ఫీల్ అవుతారు. అని చెప్పారు.నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ – మా సంస్థ తరుపున ఇప్పటిదాకా చాలా ఈవెంట్స్ చేశాం. కానీ ఇలాంటి బ్యూటిఫుల్ మ్యూజిక్ కన్సర్ట్ చేయలేదు. విజయ్ గారు మా సంస్థలో డియర్ కామ్రేడ్ చేశారు. ఆ సినిమా మేము ఎక్స్ పెక్ట్ చేసినంత హిట్ కాలేదు. కానీ ‘ఖుషి’ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది. సమంత గారు మా మైత్రీలో చేసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టరే. జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప ఎంత ఘన విజయాలు సాధించాయో చూశారు. ‘ఖుషి’ కూడా సక్సెస్ అవుతుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇంతమంచి మూవీ మాకు చేసినందుకు డైరెక్టర్ శివకు థాంక్స్ చెబుతున్నా. ‘ఖుషి’ కాస్ట్ అండ్ క్రూ అందరికీ థాంక్స్. సెప్టెంబర్ 1న థియేటర్స్ లో మా సినిమా చూడండి అన్నారు.నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ – విజయ్, సమంత మా సంస్థలో మరోసారి పనిచేయడం సంతోషంగా ఉంది. మేము ఎంజాయ్ చేస్తూ ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో ‘ఖుషి’ ది బెస్ట్ అని చెప్పాలి. డైరెక్టర్ శివ నిర్వాణతో ట్రావెల్ అంత హ్యాపీగా ఉంది. త్వరలో ఆయనతో మరో సినిమా చేయబోతున్నాం. సమంత గారు మా సంస్థలో పనిచేసేందుకు ఎప్పుడూ నో చెప్పరు. సెప్టెంబర్ 1న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ – ‘ఖుషి’ సినిమా చూసేందుకు థియేటర్స్ కు వెళ్లిన పెళ్లైన జంటలు, పెళ్లి కాని వారు, పెళ్లి లైఫ్ లో చేసుకోవద్దు అనుకునే వారు..అందరూ ఈ సినిమా చూశాక తమ లవ్ లైఫ్ లోని మెమొరీస్ షేర్ చేసుకుంటారు. ప్రేమగా హగ్ చేసుకుంటారు. సినిమా అంతా మీకు విజయ్, సమంత కాకుండా విప్లవ్, ఆరాధ్య కనిపిస్తారు. ఇదొక కొత్త కథ, ట్విస్ట్ లు, టర్న్ లు ఉంటాయని నేను చెప్పను. కానీ మీ మనసుకు హత్తుకునేలా ఉంటుంది. నాకు పెళ్లై నాలుగేళ్లయ్యింది. నా వైఫ్ తో నేను ప్రేమగా, కోపంగా, సంతోషంగా, బాధగా ఉన్న సందర్భాలన్నీ నాకు తెలియకుండానే ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యాయి. ‘ఖుషి’ మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఇంకోసారి సినిమాకు వెళ్దామని అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఫ్యామిలీ అంతా మా సినిమాను చూడొచ్చు. సినిమా పూర్తయ్యాక నాకొక మంచి ఫ్యామిలీ ఉందని మీ మీద మీకే ఒక ఇష్టం ఏర్పడుతుంది. ఈ కథను అనుకున్నట్లు తెరకెక్కించేందుకు నాకు దొరికిన రెండు డైమండ్స్ విజయ్, సమంత. అర్జున్ రెడ్డి చూశాక విజయ్ మీద ఏర్పడిన ప్రేమంతా ఈ సినిమాలో చూపించాను. నేను ఎవరి అభిమానిని అని చెప్పలేదు. కానీ సమంత అభిమానిని అని చెప్పుకుంటా. ‘ఖుషి’ చూసేందుకు రండి రెండున్నర గంటలు ఎమోషన్, ఎంటర్ టైమ్ మెంట్ గ్యారెంటీ. అన్నారు.
Also Read:మోడీ “తలపాగా “..పోలిటికల్ స్ట్రాటజీ?
హీరోయిన్ సమంత మాట్లాడుతూ – షూటింగ్ టైమ్ లో పాటలు విని ‘ఖుషి’ ఆల్బమ్ లవ్ లో పడిపోయాను. ఇక్కడ లైవ్ లో పాటలు వింటుంటే టైమ్ ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సెప్టెంబర్ 1న మీ అందరితో సినిమా చూడాలని అనిపిస్తోంది. మేమెప్పుడూ మీ అందరికీ నచ్చే సినిమా ఇవ్వాలని కోరుకుంటాం. ఈ సినిమాతో అలాంటి ప్రయత్నమే చేశాం. మైత్రీ ప్రొడ్యూసర్స్ నా ఫేవరేట్ ప్రొడ్యూసర్స్. నా ఫేవరేట్ హ్యూమన్ బీయింగ్స్ కూడా వాళ్లే. గత ఏడాదిగా నాకు వాళ్లు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. నా కెరీర్ లో మెమొరబుల్ మూవీ ‘ఖుషి’ . ఇందులో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ శివ గారికి థాంక్స్. హేషమ్ గారికి తెలుగు ఆడియెన్స్ లవ్ తెలియదు. ఇప్పుడు చూస్తున్నారు. వాళ్లు ప్రేమిస్తే ఎంత బాగా అభిమానిస్తారో ఆయనకు ఇప్పుడు తెలుస్తుంటుంది. ‘ఖుషి’ లో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వారి కాంట్రిబ్యూషన్ సినిమాకెంతో బలాన్నిచ్చింది. మీరు చూపించే ప్రేమ కోసం హెల్దీగా తిరిగి వస్తాను. బ్లాక్ బస్టర్ ఇస్తాను. అని చెప్పింది.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – ‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్ కోసం ఇక్కడికి వచ్చిన వారికి, టీవీ, యూట్యూబ్ లో చూస్తున్న వారందరికీ నా థ్యాంక్స్. సెప్టెంబర్ 1న నా తరుపున మీకు ఖుషి తీసుకొస్తున్నా. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఏ భాషలో మాట్లాడేవారైనా మీ దగ్గరకు ఖుషి పంచేందుకు వచ్చేస్తాం. మీరు సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇచ్చి ఎంతకాలం అవుతుందో గుర్తులేదు. మీ అందరికీ ఓ సూపర్ హిట్ బాకీ ఉన్నా. గత నెల రోజులుగా ఈ సినిమా వర్క్స్ గురించి డైరెక్టర్ శివతో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నా. ప్రతిసారీ ఆయన నాకు చెప్పే మాట ఒకటే. సెప్టెంబర్ 1న నీ మొహంలో నవ్వు చూడాలి విజయ్ బ్రో అని. అదొక్కటే గుర్తు పెట్టుకుని పనిచేస్తున్నా అనేవాడు. శివకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఆయన చెప్పనక్కర్లేదు. నాకు తెలుస్తుంది. ఈ సినిమాను శివ ఎంత ప్రేమించి చేశాడో రేపు సెప్టెంబర్ 1న థియేటర్స్ లో సినిమా చూస్తున్న మీ అందరికీ తెలుస్తుంది. ఈ సినిమా సక్సెస్ సంతోషం నా ఫేస్ లో కాదు సమంతలో చూడాలి. ఆమె ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో చెప్పలేను. ఏప్రిల్ లో ఎంతో హ్యాపీగా సినిమాను స్టార్ట్ చేశాం. మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జూలైలో 30, 35 డేస్ షూట్ మిగిలినప్పుడు సమంత తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పింది. నువ్వు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నావ్, నువ్వు హెల్దీగా ఉంటావ్ అని నేను, శివ సమంతకు చెప్పేవాళ్లం. మొదట్లో 3 డేస్, ఆ తర్వాత 2 వీక్స్ టైమ్ తీసుకుంది. అయినా ఆరోగ్యం బాగు కాలేదు. నేను వేరే సినిమా ప్రమోషన్ కోసం వెళ్లినప్పుడు ఆమె హెల్త్ కండీషన్ గురించి తెలిసింది. నేను ఈ విషయం గురించి మాట్లాడొద్దు అనుకున్నా. ఎందుకంటే మనం యాక్టర్స్ గా ప్రేక్షకుల్ని నవ్వించాలి. మన బాధల్ని చెప్పకూడదు అనుకున్నా. కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేక సమంత మాతో మాట్లాడటం మానేసింది. తను అంతగా స్ట్రగుల్ పడింది. అయితే ఒక సందర్భంలో సమంత తన హెల్త్ కండీషన్ గురించి మాట్లాడేందుకు ముందుకొచ్చింది. ఎందుకంటే కోవిడ్ తర్వాత ఎంతోమంది ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. నేనూ మీలాగే బ్యాటిల్ చేస్తున్నా అని వారికి ధైర్యం చెప్పేందుకు సమంత తన హెల్త్ కండీషన్ వెల్లడించింది. ఇవాళ మేము ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తుంటే చాలామంది వచ్చి సమంత మాకు ఇన్సిపిరేషన్ అని చెబుతున్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆమెకు బాగాలేదు. అయినా మన కోసం ఆమె ఇక్కడికి వచ్చింది. డ్యాన్స్ చేసింది. సెప్టెంబర్ 1న సమంతకు హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే మా డైరెక్టర్ శివకు హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. డియర్ కామ్రేడ్ టైమ్ లో శివ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పాడు. విపరీతంగా నచ్చింది. అయితే లవ్ స్టోరీస్ చేయొద్దని హోల్డ్ చేస్తూ వచ్చాను. షూటింగ్ లో ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా శివ దేని గురించి కంప్లైంట్ చేయలేదు. సినిమాను ప్రేమిస్తూ, నవ్వుతూ వర్క్ చేస్తూ వచ్చాడు. అతని కోసం సినిమా హిట్ కావాలి. మా సినిమాటోగ్రాఫర్ ఎంతో కమిటెడ్ గా వర్క్ చేశారు. అలాగే హేషమ్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. మా మైత్రీ వాళ్లకు పుష్ప 2 ఉంది. వాళ్లకు డబ్బులే డబ్బులు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఆరేడు ఏళ్లు అవుతోంది. నన్ను మీరంతా ఎంతగానో ప్రేమిస్తున్నారు. నా హిట్స్, ఫ్లాప్స్ లో నా చుట్టూ ఉన్న వాళ్లు ఎందరు మారినా మీరు మారలేదు. నాపై లవ్ చూపిస్తూ నాతోనే ఉన్నారు. సెప్టెంబర్ 1న మీ అందరి మొహాల్లో నవ్వు చూడాలని అనుకుంటున్నా. అని అన్నారు.