సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కొత్తగా కేబినెట్ విస్తరణలో ఛాన్స్ ఎవరికి దక్కుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కేబినెట్ బెర్త్ ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది. ప్రస్తుతం మంత్రివర్గంలో రేవంత్ తో పాటు 12 మంది ఉండగా మిగితా ఆరుగురు ఎవరా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రుల వివరాలను పరిశీలిస్తే….ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భట్టి విక్రమార్క,పొంగులేటి శ్రీనివాసరెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కొండా సురేఖ, దనసరి సీతక్క,ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి జూపల్లి కృష్ణారావు, శ్రీహరి ముదిరాజ్ పేరు కొత్తగా వినిపిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుండి మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు కాంగ్రెస్ నుండి చేరే ఇద్దరికి ఛాన్స్ ఉండనుంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి దామోదర రాజనర్సింహ, మెదక్ ఎమ్మెల్యే రోహిత్ పేరు వినబడుతుండగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి పోచారం శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి, మదన్‌మోహన్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రేమ్‌సాగర్ రావు పేరు ప్రముఖంగా వినబడుతోంది. ఇక కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఇప్పటికే మంత్రులుగా ఉండగా ఆది శ్రీనివాస్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.కౌన్సిల్ కోటాలో కోదండరాం, అమీర్ అలీఖాన్, బల్మూరి వెంకట్‌లకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:‘రేవు’..పార్టీలో హేమా హేమీలు