దేశమంతా తెలంగాణ వైపే!

27
- Advertisement -

2014 లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తూ ఏ రాష్ట్రానికి సాధ్యం కాని విధంగా అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. తెలంగాణ రాష్ట్రనికి మొదటి ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన కే‌సి‌ఆర్ తన పాలన దక్షతతో రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలుపుతున్నారు. విద్యా వైద్య రంగాల్లోనూ, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, నిరుద్యోగాన్ని రూపుమాపడం లోనూ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ చేస్తున్న పాలన విధానం ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణలో అమలవుతున్న చాలా పథకాలను కేంద్రం కాపీ కొడుతూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తోందంటే అతిశయోక్తి కాదు..

ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ వంటి ప్రాజెక్ట్ ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ‘ హర్ ఘర్ జల్ ‘ తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేయని విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ను ఇవ్వడం ఒక్క కే‌సి‌ఆర్ ప్రభుత్వానికే సాధ్యమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:Telangana Congress:మనసు మార్చుకున్న జానారెడ్డి!

అందుకే తెలంగాణలో జరిగిన అభివృద్దికి ధేశ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అధినేత కే‌సి‌ఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ ఘనవిజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈసారి విజయంతో ఎవరికి సాధ్యం కానీ విధంగా వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టించిన ఘనత ఒక్క కే‌సి‌ఆర్ కు మాత్రమే దక్కుతుంది. ఈసారి బి‌ఆర్‌ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ముందు రోజుల్లో దేశవ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధి విస్తరించడం ఖాయమని చెప్పవచ్చు.

Also Read:జయం రవి…’గాడ్’ సెన్సార్ పూర్తి

- Advertisement -