ముచ్చటగా మూడో బ్రేకప్‌..!

297
All Eyes on Nayant and Vignesh Break up!
- Advertisement -

వయసు పెరుగుతున్నా తరగని అందం స్టార్ హీరోయిన్ నయనతారది. నయనతార.. ఈ పేరు వినగానే ఇటు అభిమానులే కాదు దర్శకనిర్మాతలు ఆమెపై ఎంతో ఇష్టాన్ని, అభిమానాన్ని కనబరుస్తారు. నయనతార ఒకవైపు గ్లామర్ చిత్రాలలో నటిస్తూనే మరో వైపు పౌరాణిక, సాంఘిక చిత్రాలలో నటిస్తూ తెలుగింటి సీతమ్మగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించింది. కేవలం తెలుగులోనే కాదు తమిళం మలయాళ భాషలలో కూడా ఈ అమ్మడికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం నయనతార కొన్ని బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

సినిమాల కంటే ఎప్పుడు తన పర్సనల్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది ఈ బ్యూటీ. మొదట్లో శింబు తర్వాత ప్రభుదేవాతో ప్రేమయాణం నడిపిన సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో పెళ్లివరకు వచ్చి బ్రేకప్ తీసుకున్న నయన్ తర్వాత దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ప్రేమలో పడింది.

గత రెండేళ్లుగా నయన్ – విఘ్నేష్‌ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారు. ఎంతలా అంటే ఒకే అపార్ట్ మెంట్‌లో కలిసి సహజీవనం చేశారనేది బహిరంగ సత్యం. అయితే ప్రస్తుతం వీరిద్దరు వీడిపోయినట్లు కోలీవుడ్‌లో వార్త షికార్ చేస్తోంది.  గతంలో విఘ్నేష్ తో వున్న అపార్ట్ మెంట్ లో కాకుండా, నయనతార సింగిల్ గా ఒక స్టార్ హోటల్లో వుంటోందని చెప్పుకుంటున్నారు.

విఘ్నేష్‌తో  బ్రేక్ అప్ నుంచి బయటపడటానికి ప్రస్తుతం నయనతార వరుసగా ఏడు సినిమాలను ఒప్పుకొన్నట్టు తెలుస్తున్నది. విశాల్‌తో కలిసి ఆమె తాజాగా ఓ సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో ప్రభుదేవాతో ప్రేమాయణం పెళ్లిపీటల వరకు వచ్చి ఆగిపోయింది. అప్పట్లో తాము పెళ్లి చేసుకొంటున్నట్టు నయనతార మీడియాకు వెల్లడించింది. సినిమాలను అంగీకరించడం నిలిపివేసింది. శ్రీరామదాసు చిత్రం షూటింగ్‌లో నటనకు గుడ్‌బై చెప్తున్నట్టు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం విఘ్నేష్‌తో బ్రేక్ అప్ తర్వాత నయనతార మళ్లీ వరుసగా సినిమాలు చేయడం గమనార్హం.

- Advertisement -