అందరి దృష్టి దాయాదుల పోరుపైనే

343
- Advertisement -

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ఆసక్తికర పోరు జరగనుంది. దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది భారత్. మెల్‌బోర్న్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.

ఈ సంవత్సరం నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగన రెండవ టీ20 మ్యాచ్‌కోసం రిషబ్ పంత్‌తో సహా ఏడుగురు బ్యాటర్లను భారత్ బరిలోకి దింపిన విషయం విధితమే. తడి అవుట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ ను ఎనిమిది ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లో వర్షం పడే పరిస్థితులు అధికశాతం ఉంటే అప్పటికప్పుడు టీమిండియా ఈ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశాలు లేకపోలేదు.

ఇక తుదిజట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కుతుందా లేదా వేచిచూడాలి. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో చివరిలో ఒక్క ఓవర్ వేసి అద్భుత ప్రదర్శనను షమీ కనబర్చాడు. దీనికితోడు షమీ ప్రారంభంలోనైనా, చివరి ఓవర్లలోనైనా బౌలింగ్ చేయగలడు. అయితే, పత్యర్థి జట్టు బ్యాటర్ల పరుగుల ప్రవాహాన్ని నియంత్రించడంలో షమీ ఏ మేరకు విజయం సాధిస్తాడనేది ప్రశ్నగా మారింది.

తుదిజట్లు అంచనా…

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్),కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ,సూర్యకుమార్ యాదవ్,హార్ధిక్ పాండ్యా, దినేశ్‌ కార్తీక్, అక్షర్ పటేల్,అశ్విన్ /చాహల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్/ షమీ,హర్షదీప్ సింగ్.

పాకిస్థాన్: బాబర్ అజామ్(కెప్టెన్),రిజ్వాన్,మసూద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్,హైదర్ అలీ,ఇఫ్తికర్ అహ్మద్,అసిఫ్ అలీ,నసీమ్ షా, హరీస్ రావూఫ్,షాహిన్ అఫ్రిది.

- Advertisement -